భారత్‌లో త్వరలో అందుబాటులోకి క్యూడెంగ్యూ డెంగీ వ్యాక్సిన్
రిపోర్టర్: సునీల్
స్థలం: భారతదేశం
భారతదేశంలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్న డెంగీ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగ్యూ వ్యాక్సిన్‌కు భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్కెటింగ్ అనుమతులు మంజూరు చేసింది. ఈ టీకాను దేశంలో పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌తో ఒప్పందం కుదుర్చుకోగా 2027 ప్రారంభం నాటికి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎలాంటి ప్రాథమిక రక్త పరీక్షలు లేదా స్క్రీనింగ్ అవసరం లేదని, మొదటి డోస్ ఇచ్చిన మూడు నెలల వ్యవధిలో రెండవ డోస్ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు వెల్లడించారు.