హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభ: కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ గౌడ్ నిప్పులు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ వేదికగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్న ఈ సభను లక్ష మందితో విజయవంతం చేస్తామని ఆయన వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్లను తొలగిస్తూ బీజేపీ లబ్ధి పొందుతోందని ఆరోపించారు.