స్థానిక పోరులో జోరు: ప్రచార బరిలో కూటమి, వైఎస్సార్సీపీ నేతలు
రిపోర్టర్: సునీల్
స్థలం: కర్నూలు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు హోరాహోరీగా నిర్వహిస్తున్నాయని కర్నూలు మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూష తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థులు కూడా పోటాపోటీగా ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారని నేతలు వెల్లడించారు. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.