కోవూరులో దాతృత్వంతో పాఠశాల భవన నిర్మాణం పూర్తి

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని నందలగుంట గిరిజన కాలనీలో నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ ఏఈ చంద్రశేఖర్ తన సొంత ఖర్చులతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అత్మీయ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో బాలాజీరావు దాతను ఘనంగా సత్కరించారు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని పిలుపునిచ్చారు.