కిడ్నాప్ కు గురైన మైనర్ బాలిక రక్షణ: విశాఖ నగర పోలీసుల సత్వర స్పందన
రిపోర్టర్: రమేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖ నగరంలో కిడ్నాప్ కు గురైన మైనర్ బాలికను సురక్షితంగా రక్షించినట్లు విశాఖ నగర పోలీసులు వెల్లడించారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ మొదటి తేదీన 13 ఏళ్ల బాలిక అపహరణకు గురైనట్లు సమాచారం అందగానే, సౌత్ సబ్-డివిజన్ క్రైమ్ బ్రాంచ్ సిఐ మరియు సిబ్బంది వెంటనే స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి బాలిక ఆచూకీ కనుగొని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.