దేశ ప్రగతిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ పురందేశ్వరి తీవ్ర విమర్శ

రిపోర్టర్: సురేష్ స్థలం: తూర్పు గోదావరి

దేశ ప్రగతికి దోహదపడే ప్రతి సంస్కరణను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ప్రయోజనాల కంటే కేవలం రాజకీయ ప్రయోజనాలకే ఆ పార్టీ పెద్దపీట వేస్తోందని ఆమె మండిపడ్డారు. దేశంలో వస్తున్న ప్రతి మంచి మార్పును అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన పూర్తి శక్తిని ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ పురందేశ్వరి ఈ మేరకు సామాజిక మాధ్య వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.