యువత గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యంపై దాడి: ఎంపీ వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: పెద్దపల్లి
భారతీయ యువత గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని గడ్డం వంశీకృష్ణ - ఎంపీ పెద్దపల్లి వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తరలివస్తున్న యువతను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో యువత ప్రశ్నిస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అంత భయమెందుకు అని ఆయన సూటిగా నిలదీస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.