రవితేజ సినిమాలో విలన్గా జేడీ చక్రవర్తి: భారీ చిత్రానికి సన్నాహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

మాస్ మహారాజా రవితేజ నూతన చిత్రంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి పవర్ఫుల్ విలన్గా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్న ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు తులాభారం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రవితేజ సరసన ప్రియాంక అరుళ్ మోహన్, అనస్వర రాజన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా అధికారికంగా లాంచ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సినీ విశ్లేషకులు తెలిపారు.