వినయ్ భాస్కర్ కాలిగోరు వద్ద గాయం: వైద్యులు

రిపోర్టర్: ISHAM JOURNALISM స్థలం: వరంగల్

ఎంజీఎం వద్ద గాయపడిన మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కుడి కాలి గోరు వద్ద గాయం మాత్రమే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతర గాయాలేమీ లేవని తెలిపారు. కాసేపట్లో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు సమాచారం