ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం కీలక నిర్ణయం
రిపోర్టర్: రాము
స్థలం: భారతదేశం
దేశవ్యాప్తంగా రహదారి భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రేడెడ్ పాయింట్ వ్యవస్థను తీసుకురానుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ పాయింట్లు కోతకు గురవుతాయి. పదేపదే తప్పు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. నిబంధనలు పాటించేవారికి ఇన్సూరెన్స్ ప్రీమియంలో రాయితీలు ఇస్తామన్నారు.