మూడెకరాల భూమిని మూడు వేల ఎకరాలుగా చూపిన అధికారులు

రిపోర్టర్: సతీష్ స్థలం: మెదక్

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గాలి లక్ష్మీనారాయణ అనే రైతుకు ఉన్న కేవలం మూడెకరాల భూమిని, అధికారులు 22ఏ నిషేధిత జాబితాలో ఏకంగా 3,850 ఎకరాలుగా నమోదు చేశారు. దీంతో భూమిని అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక బాధితుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తప్పుగా నమోదైన ఈ రికార్డులపై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.