తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ మరో నాలుగు రోజులు నిలిపివేత

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుమల

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక గమనికను విడుదల చేసింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాలలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీని సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, సెప్టెంబర్ 25వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను సెప్టెంబర్ 24న జారీ చేయనున్నట్లు తెలిపారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో టోకెన్ కేంద్రాలకు చేరుకున్న భక్తులు నిరాశ చెందారు.