పుణెలో సామాజిక కార్యకర్త విద్యానంద్ బాపట్‌పై దాడి, తీవ్ర కలకలం

రిపోర్టర్: రాజేష్ స్థలం: మహారాష్ట్ర

పుణెలో గణేశోత్సవాల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్స్, లేజర్ లైట్ల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న సామాజిక కార్యకర్త విద్యానంద్ బాపట్‌పై దాడి జరిగింది. తనదైన శైలిలో మరాఠీ భాషా పటిమతో వాదిస్తూ 'మరాఠీ శశి థరూర్'గా పేరుగాంచిన బాపట్‌ను, తిలక్ రోడ్డులో కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా చెంపదెబ్బ కొట్టారు. పర్యావరణ పరిరక్షణ, శబ్ద కాలుష్య నియంత్రణ కోసం ఆయన చేస్తున్న పోరాటం స్థానికంగా చర్చనీయాంశమైంది.