గోగులపల్లి అభివృద్ధికి రహదారి నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
ఉప్పు సత్యాగ్రహంతో చారిత్రాత్మక గుర్తింపు ఉన్న గోగులపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే నిర్మించగా, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పది రెట్లు అధికంగా రోడ్లు నిర్మించి నిజమైన మార్పు చూపించామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.