బుగ్గమఠం భూముల వివాదం: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రిపోర్టర్: సతీష్
స్థలం: తిరుపతి
బుగ్గమఠం భూముల వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని, దేవదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం తేల్చిచెప్పిందని అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా ఎమ్మార్ పల్లి పరిధిలోని మఠం భూముల ఆక్రమణపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించిందని, ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకునేందుకు మరో నాలుగు వారాల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు.