'జాతీయ సమైక్యతా దినోత్సవ' శుభాకాంక్షలు: కె. చంద్రశేఖర్ రావు

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన చారిత్రక రోజు అని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన ఈ ప్రత్యేక దినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆయన గుర్తు చేసుకుంటూ ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు.