టీజీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు తీపి కబురు: ప్రత్యేక రాయితీలు వెల్లడి

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలను అందించేందుకు ఎంపిక చేసిన బస్సు సర్వీసుల్ లో ప్రత్యేక రాయితీ ఛార్జీలను అందుబాటులోకి తెచ్చినట్లు రంగారెడ్డి రీజియన్ ప్రాంతీయ మేనేజర్ వి. శ్రీదేవి వెల్లడించారు. ప్రైవేట్ ట్రావెల్స్ పోటీని తట్టుకోవడం, ఆక్యుపెన్సీ రేటును పెంచే లక్ష్యంతో బీహెచ్ఈఎల్ డిపో నుంచి మైసూర్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు మార్గాల్ లో నడిచే రానూపోనూ సర్వీసులకు ఈ తగ్గింపులు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు.