ఢిల్లీలో వాయుకాలుష్యం కలకలం: నేటి నుంచి గ్ర్యాప్ మొదటి దశ అమలు

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయుకాలుష్యం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. గాలి నాణ్యత సూచి పడిపోవడంతో నగరంలో గ్రాడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మొదటి దశను అమలు చేస్తున్నట్లు కమిషన్ వెల్లడించింది. దుమ్ము ధూళి నివారణ చర్యలను కఠినంగా అమలు చేయాలని సంబంధిత ప్రభుత్వ శాఖలను అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.