పల్లె పండుగతో గ్రామాల రూపురేఖలు మారుతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
పల్లె పండుగ మూడో విడత ద్వారా రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మరింత మారుతాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి పనుల నాణ్యతలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో ఐదువందల ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఉదయగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.