జూనియర్ ఆసియా కప్ సెమీస్‌లో భారత హాకీ జట్టు విజయం
రిపోర్టర్: విజయ్
స్థలం: చైనా
చైనాలో జరుగుతున్న పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘన విజయం సాధించింది. చైనీస్ తైపీపై 15-0 తేడాతో గెలుపొంది సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. భారత కెప్టెన్ అన్మోల్ ఇక్కా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఆరు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో పూల్-ఏలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.