నకిలీ మందుల వ్యవహారంపై స్పందించిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Bengaluru

కర్ణాటకలో నకిలీ మందుల పంపిణీ మరియు విక్రయాల వ్యవహారంలో ఫైజర్ కంపెనీ స్పందించింది. రోగుల భద్రత, ఉత్పత్తి నాణ్యత తమ అత్యున్నత ప్రాధాన్యతలని ఆ సంస్థ స్పష్టం చేసింది. కర్ణాటక ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇటీవల జరిపిన తనిఖీలలో నకిలీ మందుల గుట్టు రట్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది.