వనపర్తి జిల్లాలో దారుణం: ఆలయంలోకి వెళ్లిన యువకుడిపై కుల దూషణలు

రిపోర్టర్: మహేష్ స్థలం: వనపర్తి

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఆలయంలోకి వెళ్లిన దళిత యువకుడు సుధీర్ను ఎమ్మెల్యే బంధువులు కుల దూషణలతో అవమానించారని బాధితుడు ఆరోపించారు. పాత ఆలయం తొలగింపు సమయంలో గుడిలోకి వెళ్లిన తనను వెంకటరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి అడ్డుకుని తీవ్రంగా దూషించారని ఆయన వాపోయారు. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్పీ సునీతారెడ్డికి వినతిపత్రం అందజేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.