కిచిడి బండి నడుపుతూ నీట్‌లో సత్తా చాటిన పేద విద్యార్థులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కిచిడి బండి నడుపుతూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు చెందిన మహమ్మద్ బిలాల్, మహమ్మద్ షకిబ్ లు నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నారు. తండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ చదువుకున్న ఈ యువకులు కరీంనగర్, నిర్మల్ మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.