వేసవిలో తాగునీటి సమస్యల్లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్న ఎమ్మెల్యే బొజ్జు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.