ముస్లిం మైనార్టీల హక్కుల సాధనకు ఐక్య పోరాటం తప్పదన్న నాయకులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వైరా
వైరాలో జరిగిన మండల మహాసభలో మహమ్మద్ సలాం మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, రిజర్వేషన్లు, సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు. వక్ఫ్ భూములు, ఈద్గాలు, శ్మశాన వాటికలను పరిరక్షించాలని, పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యమాల గోపాలరావు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎస్కే ఇబ్రహీం, కార్యదర్శిగా ఎస్కే జానీ ఎన్నికయ్యారు.