వినాయక చవితి సందర్భంగా రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు
రిపోర్టర్: విజయ్
స్థలం: India
వినాయక చవితి పండుగ పురస్కరించుకుని సోమవారం బిఎస్ఇ, ఎన్ఎస్ఇ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. వీకెండ్ సెలవులు కలవడంతో ఇన్వెస్టర్లు వరుసగా మూడు రోజులు ట్రేడింగ్ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు. మంగళవారం నుండి మార్కెట్లు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.