గ్రామీణుల ఆరోగ్య రక్షణకై దూదివేంకటాపూర్ లో ఉచిత వైద్య శిబిరం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దూదివేంకటాపూర్ గ్రామములో శుక్రవారం టీబీ, బీపీ, షుగర్ తనిఖీ నిమిత్తం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపును స్థానిక సర్పంచ్ నడిమింటి నరేష్, ఉపసర్పంచ్ ఇరుగదిండ్ల వెంకటేష్, వార్డు సభ్యులు ఘనంగా ప్రారంభించారు. ఈ శిబిరంలో ఎక్స్-రే, తెమడ మరియు రక్త పరీక్షలను వైద్య సిబ్బంది అత్యంత శ్రద్ధతో నిర్వహించి స్థానికులకు మెరుగైన వైద్య సేవలను అందించడం జరిగింది.