గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్న అకొండపేట గ్రామ యువకులు
రిపోర్టర్: Radha. A
స్థలం: కడెం
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అకొండపేట గ్రామంలో సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను గాంధీజీ ప్రపంచానికి చాటిచెప్పారని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సంఘమిత్ర యూత్ అధ్యక్షులు నితీష్ పేర్కొన్నారు.