ఏడేళ్ల బాలికపై అత్యాచార యత్నం.. పోక్సో కేసులో 74 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కోటబొమ్మాళి

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గుంజిలోవ గ్రామానికి చెందిన కవిటి రామారావుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంగపండు సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 9న కొత్తపేటలోని ఓ కాలనీలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుల కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ లక్ష్మణరావు మార్కెట్ యార్డ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.