కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ: కీలక ప్రాజెక్టులపై విస్తృత చర్చ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: దిల్లీ
దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారని అధికారులు తెలిపారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణ, ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్ట్ర వాటాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.