ఆస్ట్రేలియా గడ్డపై విషాదం రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసుల మృతి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విశాఖపట్నం

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విశాఖపట్నం వాసులు ప్రాణాలు కోల్పోయారు. శుభకార్యంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన మాజీ వీడీసీఏ జాయింట్ సెక్రటరీ జి.టి.ప్రసాద్ దంపతుల కారును ఓ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రసాద్ భార్య మరియు కోడలు నేహా అక్కడికక్కడే మృతి చెందగా, కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల సహాయంతో మృతదేహాలను పది రోజుల తర్వాత విశాఖకు తీసుకువచ్చే అవకాశం ఉందని సమాచారం అందింది.