నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన బీజేపీ మహాపాదయాత్ర

రిపోర్టర్: శివ స్థలం: నిర్మల్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దామన్న పిలుపుతో నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ మహాపాదయాత్ర ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా నుంచి ఈ యాత్రను మొదలుపెట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావు, ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు ప్రముఖ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొని ముందుకు సాగుతున్నారు.