లండన్ నుంచి బంగ్లాదేశ్ వస్తున్న విమానంలో ప్రయాణికుల మధ్య భీకర ఘర్షణ
రిపోర్టర్: సునీల్
స్థలం: World
లండన్ నుండి బంగ్లాదేశ్ వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణికుల మధ్య గాల్లోనే భీకర ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగి పరస్పరం పిడిగుద్దులు గుంపుకున్నారు. ఈ అకస్మాత్తుగా జరిగిన హింసాత్మక ఘటనతో తోటి ప్రయాణికులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్యాబిన్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరినీ వేరు చేయడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనపై ఎయిర్లైన్స్ జనరల్ మేనేజర్ మహబూబుద్దీన్ అహ్మద్ స్పందిస్తూ తనకు ఇంకా పూర్తి సమాచారం అందలేదని తెలిపారు.