ఇందూరులో పదేళ్లుగా ఇన్ఛార్జుల పాలన: అంతులేని కల్తీతో ప్రజారోగ్యానికి పెను ముప్పు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాల శాఖ దశాబ్దకాలంగా ఇన్ఛార్జుల పాలనలోనే కొనసాగుతోందని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత వెల్లడించారు. నగరంలోని హోటళ్లు, దాబాల్లో తనిఖీలు పడకేయడంతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత కారణంగా ఫిర్యాదు వస్తేనే స్పందిస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎన్ఫోర్స్మెంట్ కొరడాఝుళిపించి కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలను ముమ్మరం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.