బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం: కుంతుర్ల, కిముడుపల్లి పంచాయతీలను కలిపే ప్రధాన రహదారిలో బ్రిడ్జి నిర్మించాలని కిముడుపల్లి ఎంపీటీసీ పాంగి రామారావు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే ఐటీడీఏ స్పందనలో వినతులు ఇచ్చినా అధికారులు స్పందించలేదన్నారు. బ్రిడ్జి నిర్మిస్తే రెండు పంచాయతీల ప్రజలతో పాటు నూర్మతి, జి.మాడుగుల ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.