ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలకు ఊపిరిపోస్తున్న జాతీయ రహదారి విస్తరణ
రిపోర్టర్: మహేష్
స్థలం: అల్లూరి సీతారామరాజు
రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు 367 కి.మీ మేర జాతీయ రహదారి-516ఈ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.3,350 కోట్లతో 10 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 240 కి.మీ పనులు పూర్తయ్యాయి. అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటక రంగానికి కొత్త ఊపు లభించనుంది.