గణేష్ మండపాలకు ఆన్లైన్లో పోలీస్ అనుమతులు తప్పనిసరి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా మాత్రమే పోలీస్ అనుమతులు పొందాలని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి.మన్మధకుమార్ సూచించారు. నిర్వాహకులు తెలంగాణ స్టేట్ పోలీస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
మండపాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, విద్యుత్, అగ్నిప్రమాద భద్రతా చర్యలు పాటించాలని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.