రైతుల గోడు పట్టని రేవంత్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

సాగునీళ్లు, కరెంటు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వడం చేతకాక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. రైతుల గోడు పట్టని దుర్మార్గపు ప్రభుత్వమని విమర్శిస్తూ రాష్ట్రంలో నెలకొన్న దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.