విద్యుత్ షార్ట్ సర్క్యూట్ బీభత్సం: కామన్ పల్లిలో కాలిబూడిదైన గడ్డివాము

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జాడి బానయ్యకు చెందిన గడ్డివాము మంటల్లో పూర్తిగా కాలిపోయింది. జన్నారం మండల కేంద్ర పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో గడ్డివాము అగ్నికి ఆహుతి కావడంతో రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.