నక్సల్స్ బాధితులకు కృత్రిమ అవయవాల అందజేత: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

రిపోర్టర్: అశోక్ స్థలం: ఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రథసారధిగా ఇరవై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీ నుంచి జూమ్ మీటింగ్లో ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ బాధితులతో ఆయన మాట్లాడారు. నక్సలిజం మూలంగా వైకల్యం బారినపడిన గిరిజనులకు ఈ అభియాన్ కింద కృత్రిమ అవయవాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు.