ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్న జన్నారం వాసి గవ్వల శ్రీకాంత్

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జన్నారం మండల కేంద్రానికి చెందిన గవ్వల శ్రీకాంత్ పోటీ చేయనున్నారు. తెలంగాణ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన పట్టభద్రుల సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు సాధించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.