ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఇండోర్
ఇండోర్లో జరిగిన ఛత్ర కీ గూంజ్ కార్యక్రమంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో స్టాండప్ కమెడియన్ ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ కమెడియన్లు, జోకర్ల పార్టీగా మారిందని కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. నైతిక దివాలాకోరుతనానికి రాహుల్ గాంధీ దిగజారారని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు.