కువైట్ జాతీయ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్న రాజంపేట కుర్రాడు
రిపోర్టర్: మహేష్
స్థలం: వైఎస్సార్ కడప
వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు చెందిన నెట్టం విశ్వతేజ కువైట్ జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి అరుదైన ఘనత సాధించారని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆటపై ఉన్న మక్కువతో క్రికెట్‌ను కెరీర్‌గా మలచుకున్నానని విశ్వతేజ పేర్కొన్నారు. కువైట్ తరఫున నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆయన, బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాలలో రాణిస్తూ భవిష్యత్తులో ఐపీఎల్లో ఆడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.