విశాఖ విద్యుత్ కాల్ సెంటర్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మంత్రి గొట్టిపాటి
రిపోర్టర్: మహేష్
స్థలం: బాపట్ల
విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోని 1912 కాల్ సెంటర్ను తనిఖీ చేసినట్లు గొట్టిపాటి రవి కుమార్ - విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలకు అందుతున్న విద్యుత్ సేవలపై నేరుగా సమీక్షించామని పేర్కొన్నారు. ఫిర్యాదు నమోదు చేసిన వినియోగదారులతో లైవ్లో మాట్లాడి వారి సమస్యలు, శాఖ నుంచి అందిన స్పందన, పరిష్కారంపై అభిప్రాయాలు తెలుసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.