దిల్లీలో దారుణం: అదృశ్యమైన పదేళ్ల బాలుడు శవమై లభ్యం

రిపోర్టర్: మహేష్ స్థలం: Delhi

దిల్లీలోని బావనా ప్రాంతంలో అదృశ్యమైన పదేళ్ల బాలుడు ఇంతిజార్ మృతదేహం అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఆడుకుంటూ కనిపించకుండా పోయిన బాలుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని తండ్రి అయూబ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నరేలా పారిశ్రామిక ప్రాంతంలో రక్తం మడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంటూ దర్యాప్తు వేగవంతం చేశారు.