కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
రిపోర్టర్: రమేష్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసనలు తెలపగా, ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వరదరాజపూర్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించి ముందస్తుగా పలువురు బీఆర్‌ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.