నాగోల్ హత్య కేసులో మంత్రి తుమ్మల అనుచరుడి అరెస్ట్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జేకే మహేష్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడని తేలింది. ప్రభుత్వ వాహనం బోర్డు ఉన్న కారులో వచ్చి నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారు. కాంగ్రెస్ నాయకులతో సంబంధాలు ఉన్న జేకే మహేష్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.