నేలకొండపల్లి మండలంలో అత్యంత వైభవంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రకరకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ పాటలు పాడుతూ చప్పట్లతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా గడిపారు. దీంతో ఆయా గ్రామాల్లో పండుగ సందడి నెలకొని ఆధ్యాత్మిక వాతావరణం పూర్తిగా వెల్లివిరిసింది.