యెమెన్ హూతీలపై వైమానిక దాడి నిర్ణయాన్ని విరమించుకున్న ట్రంప్
రిపోర్టర్: రమేష్
స్థలం: అమెరికా
యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనప్పటికీ, చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అభ్యర్థన మేరకు మొదట దాడులకు ఆదేశించినా, పెంటగాన్ ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత ఆదివారం నాటికి ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని దాడులను నిలిపివేశారు.