ది ప్యారడైజ్ చిత్రంలో కేసీఆర్ పోలికలతో ప్రియదర్శి పాత్ర

రిపోర్టర్: గోపి స్థలం: గోదావరిఖని

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా, గోదావరిఖని నేపథ్యంలో సాగే కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే సినిమాలో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ అన్న పాత్ర అచ్చం మాజీ సీఎం కేసీఆర్ను పోలి ఉండటం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.